హైదరాబాద్, వెలుగు: డిమాండ్‌కు తగ్గట్టుగా రోజువారీ విమాన సర్వీసుల సంఖ్యను నాలుగు వేలకు పెంచుతామని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ప్రకటించారు. ప్రతి వారం ఒక కొత్త విమాన సర్వీసును అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
హైదరాబాద్‌లో బుధవారం మొదలైన వింగ్స్ ఎయిర్ షో సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2030 నాటికి విదేశీ విమానాల ప్రయాణ సామర్థ్యాన్ని 40 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఎయిర్ లైన్ అయిన ఇండిగో వద్ద 440 విమానాలు ఉన్నాయి. ప్రతిరోజూ 2,200 సర్వీస్‌లను నడుపుతున్నామని పీటర్ వెల్లడించారు.
కొత్తగా 3,700 విమానాలు కావాలి
భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో విమానయాన రంగం భారీగా విస్తరించనుందని, రాబోయే 20 ఏళ్లలో ప్రయాణికుల రద్దీ ఏటా 7 శాతం చొప్పున పెరగనుందని విమానాల తయారీ కంపెనీ బోయింగ్ప్రకటించింది. దీనివల్ల 2044 నాటికి ఈ ప్రాంత ఎయిర్‌లైన్స్‌కు 3,300 కొత్త విమానాలు అవసరమవుతాయని కంపెనీ సీనియర్ఎగ్జిక్యూటివ్ప్రశాంత్నాయుడు తెలిపారు.
వింగ్స్ ఇండియా సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం ఉన్న 795 విమానాల సంఖ్య రెండు దశాబ్దాల్లో 2,925కు చేరుకుంటుంది. సరుకు రవాణా విమానాల సంఖ్య ఐదు రెట్లు పెరగవచ్చు. ఈ డిమాండ్‌ను తట్టుకోవడానికి 45 వేల పైలట్లు, 45 వేల టెక్నీషియన్లు 51 వేల క్యాబిన్ సిబ్బంది కావాలి. విమాన సేవల కోసం రూ.16 లల కోట్ల పెట్టుబడులు అవసరం”అని వివరించారు.
ఏకేఎస్ఐ నుంచి కార్గో డ్రోన్
ఏకేఎస్ఐ ఏరోస్పేస్ గ్రూప్ వింగ్స్ ఇండియా 2026 లో స్కై షిప్పర్ కార్గో డ్రోన్ ప్లాట్ ఫామ్ ప్రవేశపెట్టింది. ఇది వాణిజ్య, వైద్య, పారిశ్రామిక లాజిస్టిక్స్ అవసరాల కోసం ఉపయోగపడుతుంది. బరువు 52 కేజీలు కాగా, 30 కేజీల వరకు బరువును మోయగలదు. ఈ డ్రోన్45 నిమిషాల పాటు ప్రయాణిస్తుంది.
సైనిక నిఘా కోసం స్కైవింగ్ 90 క్వాడ్ కాప్టర్‌ను కూడా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏకేఎస్ఐ ఏరోస్పేస్ డ్రోన్ల తయారీ వ్యవస్థను ప్రదర్శించింది. వ్యవసాయ అవసరాల కోసం ఖేత్ పైలట్ పేరుతో ఏఐ డ్రోన్ ప్లాట్ ఫామ్ తీసుకువచ్చింది. ఇది పంటల పర్యవేక్షణకు సహాయపడుతుంది.
