గత ఏడాది ‘కూలి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన శ్రుతిహాసన్.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. అందులో దుల్కర్ సల్మాన్ సినిమా కూడా ఉంది. దుల్కర్ హీరోగా పవన్ సాదినేని తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు.
దుల్కర్‌కు జంటగా కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి నటిస్తోంది. అయితే ఇందులో ఓ కీలకపాత్రను శ్రుతిహాసన్ పోషిస్తోంది. బుధవారం తన బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని రివీల్ చేస్తూ, తన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. కథను మలుపుతిప్పే పాత్రలో ఆమె కనిపించనుందని, తన ప్రజెన్స్ పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు.
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్. చివరిదశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం వేసవిలో పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది. మరోవైపు ‘సాలార్ 2’ మేకర్స్ కూడా శ్రుతిహాసన్‌కు బర్త్ డే విషెస్ తెలియజేశారు.
