ప్రభుత్వంలో ఎలాంటి విభేదాలు లేవు..బురదజల్లే ప్రయత్నం చేస్తోన్న ప్రతిపక్షాలు

ప్రభుత్వంలో ఎలాంటి విభేదాలు లేవు..బురదజల్లే ప్రయత్నం చేస్తోన్న ప్రతిపక్షాలు
  • మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు 

గోదావరిఖని/ సుల్తానాబాద్ ‌‌, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య విభేదాలు ఉన్నట్లు కొందరు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ ‌‌ ‌‌బాబు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో  మంత్రులం దరూ కలిసే పని చేస్తున్నారన్నారు. 

గోదావరిఖని, సుల్తానాబాద్​లో జరిగిన మున్సిపల్​ఎన్నికల సన్నాహక సమావేశాల్లో  మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్​బాబు మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు కొద్దిరోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. సింగరేణిలో బొగ్గు స్కామ్ ‌‌ అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ‌‌ ‌‌ కలిసి నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియా, కొన్ని సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని పట్టించుకోవద్దన్నారు. నలుగురు మంత్రులు సమావేశమై మాట్లాడుకుంటే కూడా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్​ విజయం తథ్యమని రాష్ట్ర ఎక్సైజ్​ శాఖ మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్​మున్సిపల్​ఎన్నికల ఇన్ ‌‌చార్జి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. రామగుండం కార్పొరేషన్  మేయర్​ పీఠాన్ని చేజిక్కించుకుంటున్నారు.  

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉనికి కోసమే బీఆర్ఎస్ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. స్కాములన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, చివరకు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ ఫోన్ ట్యాపింగ్ ‌‌కు పాల్పడినట్లు ఆరోపించారు. పెద్దపల్లి మాజీ ఎంపీపీ అయిల రమేశ్ ‌‌ అనుచరులతో కలిసి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ‌‌లో చేరారు. సమావేశాల్లో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్ ‌‌ఠాకూర్​, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తదితరులు పాల్గొన్నారు.