వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా వినయ్ రత్నం తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’. చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మిస్తున్నారు. చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాత. ఫిబ్రవరి 6న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేసి బెస్ట్ విషెస్ చెప్పాడు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘అంతా కొత్తవాళ్లతో తీసిన ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది. చాలా మెచ్యూర్డ్ అండ్ ఇన్‌స్పిరేషన్ స్టోరీతో రాబోతున్నాం. ప్రస్తుత యువత చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. ‘మీలోని లోపం మీకు బలం అవ్వాలి’ అనే సందేశంతో, యువతలో స్ఫూర్తి నింపేలా తెరకెక్కించాం.
నేటి సమాజానికి ఎంతో అవసరమైన కథ. అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత గార్లపాటి, అరుణ్ కుమార్, తులసి, నాయుడు మోరం, శంకర్ రావు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
