కేంద్రం విధానాలపై కార్మికులు పోరాడాలి..ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు

కేంద్రం విధానాలపై కార్మికులు పోరాడాలి..ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు
  • సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు  చుక్క రాములు

మెదక్​ టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పిలుపునిచ్చారు. వీబీజీ రాంజీ, విత్తన చట్టం రద్దుకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని తెలిపారు.

బుధవారం మెదక్​ టౌన్ లోని కేవల్​కిషన్​భవనంలో సీఐటీయూ, ఏఐఏడబ్ల్యుయూ, ఏఐకేఎస్, ఎన్​పీఆర్​డీ, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, వృత్తిదారుల సమన్వయ కమిటీ సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె విజయవంతానికి నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.  స్వాతంత్ర్యం రాకముందే కార్మికులు  పోరాడి చట్టాలు తెచ్చుకున్నారని, కేంద్రం పూర్తిగా తొలగించి 4 లేబర్ కోడ్స్ గా తీసుకురావడం సిగ్గుచేటని మండిపడ్డారు. 

దేశ సంపదను ఆదాని, అంబానీలకు కట్టబెట్టేందుకే లేబర్ కోడ్స్ తెచ్చారని ఆరోపించారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కార్మికులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.  సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ఆయా సంఘాల నేతలు ఎ.మల్లేశం, కె.మల్లేశం, యశోద,  నర్సమ్మ,  మహేందర్ రెడ్డి, నాగరాజు, బస్వరాజు, వివిధ ప్రజా సంఘాల నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.