న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐ) ఆదాయం, ప్రాఫిట్ పెంచుకునేందుకు వీఐ 2.0 స్ట్రాటజీని ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే మూడు సంవత్సరాల్లో డబుల్ -డిజిట్ రెవెన్యూ గ్రోత్ సాధించాలని, ఆపరేటింగ్ ప్రాఫిట్ (ఇబిటా) ను మూడు రెట్లు పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.
సబ్‌స్క్రయిబర్లను స్థిరంగా పెంచుకోవడంపై ఫోకస్ పెట్టనుంది. ఈ స్ట్రాటజీ కింద రూ.45 వేల కోట్లను ఖర్చు చేయనుంది. గత ఆరు క్వార్టర్లలో ఖర్చు చేసిన రూ.18 వేల కోట్లతో కలిపితే కంపెనీ మొత్తం క్యాపెక్స్ (పెట్టుబడి) రూ.60 వేల కోట్లకు చేరుతుంది.
