పటాన్ చెరులోని కర్ధనూర్ లో మంత్రులకు ఘన స్వాగతం

పటాన్ చెరులోని కర్ధనూర్ లో మంత్రులకు ఘన స్వాగతం

పటాన్​చెరు, వెలుగు: పటాన్ చెరులోని కర్ధనూర్ లో బుధవారం సబ్ రిజిస్ట్రార్​కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి బుధవారం హాజరయ్యారు.

 మార్గమధ్యలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వారికి కాంగ్రెస్​మెదక్ పార్లమెంట్​ఇన్​చార్జి నీలం మధు ముదిరాజ్ ఘన స్వాగతం పలికారు. బొకేలు అందించి, శాలువాలతో సత్కరించారు. కర్ధనూర్ లో సబ్​రిజిస్ట్రార్​ఆఫీస్​భవన పనులు ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.