అమీన్పూర్ సమ్మక్క జాతర షురూ..

అమీన్పూర్ సమ్మక్క జాతర షురూ..

అమీన్​పూర్, వెలుగు: అమీన్​పూర్ డివిజన్ పరిధిలో సమ్మక్క, సారలమ్మ జాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. అమ్మవార్ల గద్దెల వద్ద ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్​ పాండురంగారెడ్డి, మాజీ వైస్​చైర్మన్ నరసింహగౌడ్​, మాజీ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పూజలు చేశారు. పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో సమ్మక్కకు జోగిని శ్యామల మొదటి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించారు. సమ్మక్క, సారలమ్మ కృపతో పటాన్​చెరు నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. 

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

రూ.3.30 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి శంకుస్థాపనలు చేశారు. రూ.30 లక్షల సొంత నిధులతో చోటి మసీదు కమిటీ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ పనులను ప్రారంభించారు. పటాన్​చెరు ఏపీఆర్​లగ్జూరియా కమ్యూనిటీలో రామాలయ పనులను పరిశీలించారు. రామాలయం, శివాలయం నిర్మాణానికి రూ.75 లక్షల విరాళం ప్రకటించారు.