ఎస్సీ కార్పొరేషన్ అప్లికేషన్లు పరిష్కరించండి : కలెక్టర్ హైమావతి

ఎస్సీ కార్పొరేషన్ అప్లికేషన్లు పరిష్కరించండి :  కలెక్టర్ హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: ఎస్సీ కార్పొరేషన్ పెండింగ్ అప్లికేషన్లను పరిష్కరించి, లబ్ధిదారులకు జీవనోపాధి కల్పించాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలో 2020–-21 సంవత్సరానికి నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా డెయిరీ ఫామ్స్ ఏర్పాటు, ఇతర ఆర్థిక సహాయ పథకాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. 

ఎస్సీ ప్రీమెట్రిక్​ స్కాలర్​షిప్​పై సమీక్ష

ఎస్సీ సంక్షేమ వసతిగృహాల సంక్షేమ అధికారులు, విద్యాశాఖ అధికారులతో ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ పై కలెక్టర్​ సమీక్షించారు. జిల్లాలోని ఎస్సీ హాస్టళ్లలో చదువుతున్న 863 మంది విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లకు వారి ఆధార్ నంబర్లను అనుసంధానించని కారణంగా స్కాలర్​షిప్​ పెండింగ్ పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి కలెక్టరేట్ లోని ఎన్ఐసీ వారితో ప్రత్యేకంగా కంప్యూటర్లను ఏర్పాటు చేశారు.

కూరల నాణ్యత మెరుగుపడాలి

విద్యార్థులకు రుచికరమైన భోజనం వడ్డించాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. దుబ్బాక మండలంలోని దుంపలపల్లి హైస్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని బుధవారం పరిశీలించారు. కూరల నాణ్యత మెరుగుపడాలని, ఇష్టానుసారం పెడితే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు.