జిన్నారం, వెలుగు: గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని కాజిపల్లికి చెందిన బీఆర్ఎస్ మాజీ వార్డు సభ్యురాలు రాజేశ్వరితోపాటు నాయకులు కంజర్ల జగన్, మహేశ్, ప్రణీత్, నరేందర్, గౌతమ్ బుధవారం తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. వారికి కాంగ్రెస్పటాన్ చెరు నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ కండువాలు కప్పి ఆహ్వానించారు. జంగంపేట్ కు చెందిన 50 మంది యువకులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
జిన్నారం మున్సిపల్ రాళ్లకత్వ తండా నుంచి బీఆర్ఎస్ యువ నాయకులు ప్రవీణ్, గోపి, జనక్, లక్ష్మణ్, కుమార్, సుమన్, చిన్న, శివ కాంగ్రెస్ లో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, బొల్లారం మాజీ కౌన్సిలర్ చంద్రారెడ్డి, జిన్నారం మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి తదితరులున్నారు.
