హైదరాబాద్, వెలుగు: కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ హైదరాబాద్‌లో బుధవారం ఒకే రోజు 4 కొత్త స్టోర్లను ప్రారంభించింది. నల్లగండ్ల, కూకట్‌పల్లి, లేక్‌షోర్ వై జంక్షన్, కొండాపూర్ ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి.
కొండాపూర్ స్టోర్ ప్రారంభోత్సవానికి నటి ప్రియాంక మోహన్ హాజరయ్యారు. తాజా విస్తరణతో హైదరాబాద్ లో మొత్తం కుషాల్స్ స్టోర్ల సంఖ్య 17 కు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం లోపు నగరంలో 20 స్టోర్లను తెరవనుంది.
