నాలుగో టీ20లో న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా విక్టరీ

నాలుగో టీ20లో న్యూజిలాండ్‌పై  సౌతాఫ్రికా విక్టరీ

వెల్లింగ్టన్: యంగ్  బ్యాటర్ కానర్ ఎస్టర్‌‌‌‌హుయిజెన్ (57) మెరుపు ఫిఫ్టీకి తోడు  స్పిన్నర్లు కేశవ్ మహారాజ్ (2/22), ప్రినిలన్  సుబ్రాయన్ (2/13) సత్తా చాటడంతో   న్యూజిలాండ్‌‌తో నాలుగో టీ20లో  సౌతాఫ్రికా 19 రన్స్ తేడాతో విజయం సాధించింది. దాంతో ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 2–2తో సమం చేసింది.  

ఆదివారం జరిగిన ఈ పోరులో  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 164/ 5 స్కోరు చేసింది. ఛేజింగ్‌‌లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 145 రన్స్‌‌కు ఆలౌటై ఓడిపోయింది. టిమ్ రాబిన్సన్ (32), డేన్ క్లీవర్ ( 26) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు.  కానర్ కు ప్లేయర్ ఆఫ్​ది మ్యాచ్‌‌ అవార్డు దక్కింది.  ఐదో, చివరి మ్యాచ్ బుధవారం క్రైస్ట్‌‌చర్చ్‌‌లో జరగనుంది.