అవినీతి నిర్మూలన కోసం కలిసి నడుద్దాం

అవినీతి నిర్మూలన కోసం కలిసి నడుద్దాం
  • దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ 

సికింద్రాబాద్​, వెలుగు: సమాజాభివృద్ధిలో అవినీతి పెద్ద లోపమని, నిర్మూలన మిషన్ లో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కోరారు.  దక్షిణ మధ్య రైల్వే నిఘా అవగాహన వారోత్సవంలో భాగంగా శనివారం రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో  సమగ్రత (ఇంటిగ్రిటీ) వాకథాన్ ను నిర్వహించింది. దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మల్ఖేడే, వివిధ శాఖల అధికారులు క్రీడాకారులు పాల్గొనగా  ఆయన ర్యాలీని ఊపి ప్రారంభించి మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వే జోనల్ లోని అన్ని డివిజన్లతో పాటు మూడు ప్రధాన వర్క్ షాప్ లు, ఫీల్డ్ యూనిట్లలో  రైల్వే సిబ్బందికి,  ప్రజలకు అవగాహన కల్పించడానికి పలు ప్రోగ్రామ్స్ నిర్వహించారు.