రైళ్ల ఆలస్యానికి కారణాలు గుర్తించాలి : అరుణ్ ​కుమార్​ జైన్

రైళ్ల ఆలస్యానికి కారణాలు గుర్తించాలి : అరుణ్ ​కుమార్​ జైన్

సికింద్రాబాద్, వెలుగు: కొన్ని ప్రాంతాల్లో రైళ్ల జాప్యానికి గల కారణాలను గుర్తించి, సరిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్​కుమార్​జైన్ అధికారులను ఆదేశించారు. రైళ్ల సగటు వేగాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం ఆయన దక్షిణ మధ్య రైల్వే జోన్​ పరిధిలో రైళ్ల భద్రత, సమయపాలనపై తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ద్వారా సమీక్ష నిర్వహించారు. 

లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, పర్మినెంట్ వే మెయింటెనెన్స్ సిబ్బంది, రన్నింగ్ సిబ్బందికి క్రమం తప్పకుండా భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. మెయిల్, ఎక్స్​ప్రెస్ రైళ్ల సమయపాలనను మెరుగుపరచాలని చెప్పారు. సమీక్షలో సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్ డివిజనల్ రైల్వే మేనేజర్లు పాల్గొన్నారు.