ప్రతి నిరుద్యోగికి రూ.40 వేలు.. పార్టీలు చేసుకోండి..

ప్రతి నిరుద్యోగికి రూ.40 వేలు.. పార్టీలు చేసుకోండి..

ఏ దేశానికైనా యువతే బలం. దేశ యువత బలంగా ఉంటే దేశ ప్రగతి పటిష్టంగా ఉంటుంది. అలాంటి  యువతే దారితప్పితే దేశం పరిస్థితి ఏంటీ.. అంధకారంలోకి వెళ్లడం ఖాయం. అందుకే దేశంలోని యువత బలంగా ఉండేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా యువతకు ఉపాధి కల్పించడంతో పాటు నిరుద్యోగ భృతి అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. యువతను చైతన్యవంతం చేయడమే దీని వెనుక ఉద్దేశమని స్పష్టం చేశారు.

దక్షిణ కొరియా ప్రభుత్వం యువత కోసం తీసుకున్న కీలక నిర్ణయాన్ని త్వరలోనే అమలు చేయనుంది, ప్రతి యువకుడికి ప్రతి నెలా రూ.40వేలు ఇవ్వనున్నట్లు ఇంతకు ముందే అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఈ వార్త అక్కడి దేశంలోనే కాదు.. నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్న భారత్ చాలా దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.

డిప్రెషన్‌లోకి యువత

దక్షిణ కొరియా దేశంలో చాలా మంది యువత డిప్రెషన్‌లో ఉన్నారు. కొరియా ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ అఫైర్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..  19 నుంచి 39 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న 3 లక్షల 50వేల మంది ఒంటరిగా లేదా ఒంటరితనంతో పోరాడుతున్నారు. ఈ సందర్భంగా యువతను డిప్రెషన్ నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ఇలా నిరుద్యోగులకు అలవెన్సులు ఇవ్వడం వల్ల వారు ఇంటి నుంచి బయటికి వచ్చి.. పార్టీలు చేసుకోవడం లాంటి పనులతో వారి మూడ్‌ చేంజ్ అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని 2022 నవంబర్‌లో తీసుకోగా.. ఇప్పుడు డబ్బులు పంపిణీ చేయటం మొదలుపెట్టారు.

ప్రపంచంలోనే ప్లాస్టిక్ సర్జరీకి ప్రసిద్ధి చెందిన దక్షిణ కొరియా రహదారిపై మరిన్ని ప్రణాళికలు ఉన్నాయి. సాంకేతికతలోనూ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ దేశంలో.. యువత జీవితం చాలా మోనాటనస్‌గా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారి జీవితానికి వినోదం పంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇవే కాకుండా పలు రకాల అలవెన్సులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా వారి రూపాన్ని మెరుగుపరిచేందుకు శస్త్ర చికిత్సలు చేయడం, యువత సన్నగా ఉండేందుకు జిమ్స్ లు ఏర్పాటు చేయటం వంటివి ప్రభుత్వమే చేస్తుంది. దీంతో దేశంలోని ప్రతి యువకుడు ఆత్మవిశ్వాసంతో ఉంటాడని అక్కడి ప్రభుత్వం నమ్ముతోంది.