South Korea Food Crisis: గొడ్డు మాంసం, కొవ్వు కణాలతో..కొత్త రకం హైబ్రిడ్ రైస్ తయారీ

South Korea Food Crisis: గొడ్డు మాంసం, కొవ్వు కణాలతో..కొత్త రకం హైబ్రిడ్ రైస్ తయారీ

సియోల్: దక్షిణ కోరియా శాస్త్రవేత్తలు కొత్త రకం హైబ్రిడ్ రైస్ను అభివృద్ధి చేశారు. దక్షిణ కొరియాలో ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వాతావరణ మార్పులను పరిష్కరించేందుకు ఈ కొత్త  రకం మాంసం బియ్యాన్ని తయారు చేస్తున్నారు. ఈ కొత్తరకం ధాన్యాన్ని సియోల్ లోని యోన్సీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగ శాలలో విజయవంతంగా పెంచారు. ఈ కొత్తరకం బియ్యం గొడ్డు మాంసం కండరాలు, కొవ్వు కణాలతోనిండి ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. 

గులాబీ రంగులో ఉంటే ఈ కొత్త రకం బియ్యం మాంసానికి ప్రత్యామ్నాయాన్ని అందించగలదని, తక్కువ కార్మన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తుందని శాస్త్రవేత్తల బృందం చెబుతోంది. ఇది సాధారణ బియ్యం కంటే 8 శాతం ఎక్కువ ప్రోటీన్, 7 శాతం ఎక్కువ క్రొవ్వులను అందించగలదు., సహజ ధాన్యాలకంటే దృఢంగా , పెళుసుగా ఉంటుందని చెప్పారు. వీటిని మార్కెట్లోకి తెస్తే కొరియన్లకు చాలా చౌకైన బియ్యం లభించనట్లే అని అంటున్నారు.

ఈ హైబ్రిడ్ బియ్యం కిలో ధ రూ. 2.23 డాలర్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.  ప్రతి 100 గ్రాముల ప్రోటీన్ ఉత్పత్తికి హైబ్రిడ్ బియ్యం 6.27 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తుందని అంచనా వేశారు. అయితే గొడ్డు మాంసం ఉత్పత్తికి 8 రెట్లు ఎక్కువగా విడుదలవుతుందని ఓ ప్రకటనలో శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

బియ్యం మార్కెట్లో వెళ్లే ముందు ఈ ప్రక్రియను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో పోషక విలువలు ఇంకా ఎక్కువగా పెరుగుతాయని చెపుతున్నారు.