Good News : క్యాన్సర్ వ్యాక్సిన్ కనిపెట్టిన రష్యా

Good News : క్యాన్సర్ వ్యాక్సిన్ కనిపెట్టిన రష్యా

క్యాన్సర్ ఓ భయంకరమైన వ్యాధి. దీనికి ప్రత్యేక చికిత్స అంటూ ఏమీ లేదు. కొన్ని కారణాల వల్ల శరీరంలో క్షణాలు విభజన జరిగి క్యాన్సర్ వ్యాధి వస్తోంది. ఈ కణాలు విభజన జరిగే శరీర భాగాన్ని బట్టీ క్యాన్సర్ కు గర్భాశయ కాన్సర్, నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అని పిలుస్తారు. ప్రస్తుతం భారత దేశంలో ప్రతిఏటా13 నుంచి -14 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, 2026 నాటికి ఇది వీరి సంఖ్య 20 లక్షలకు చేరుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెబుతుంది. భారత్ తో సహా అన్ని అనేక దేశాలు ఈ ప్రాణాంతకరమైన వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రయోగాలు చేస్తున్నాయి. క్యాన్సర్ వస్తే ఓ పట్టాన నయం కాదు. లాస్ట్ స్టేజ్ వరకూ గుర్తించలేక పోతే  రోగి చనిపోతాడు.

రష్యా క్యాన్సర్ రాకుండా చేసే వ్యాక్సిన్, వచ్చినా తగ్గించడానికి ఇమ్యునోమోడ్యులేటరీ  మందులపై పరీక్షలు జరుపుతుందని ఆ దేశ అధ్యక్షుడు వ్లామిదిన్ పుతిన్ అన్నారు. ఫ్యూచర్ టెక్నాలజీ మీద బుధవారం జరిగిన మాస్కో ఫోరమ్ లో పాల్గొని ఆయన మాట్లాడారు. క్యాన్సర్ కు రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. రష్యా కనిపెట్టిన క్యాన్సర్ వ్యాక్సిన్  వినియోగానికి చాలా దగ్గరగా వచ్చిందని అన్నారు. ఇప్పటికే అమెరికా, జర్మనీ పలు దేశాలు క్యాన్సర్ వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పనిచేస్తున్నాయి. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ పై లాస్ట్ స్టేజ్ ట్రయల్స్ జరుగుతున్నాయని త్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని పుతిన్ తెలిపారు. 

Also Read: ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది..అవినీతిలేని ప్రభుత్వాలే