దినేష్ కార్తీక్కు సౌతాఫ్రికా సిరీస్ డూ ఆర్ డై

దినేష్ కార్తీక్కు సౌతాఫ్రికా సిరీస్ డూ ఆర్ డై

దినేష్ కార్తీక్..భారత క్రికెట్లో అతనో పడిలేచిన కెరటం. కుటుంబ సమస్యలతో సతమతమై కొన్నాళ్లు క్రికెట్కే దూరమయ్యాడు. కష్టా నష్టాలకోర్చి చివరకు క్రికెటర్గా నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2022 అతని క్రికెట్ కెరియర్కు టర్నింగ్ పాయింట్.  వేలంలో ఆర్సీబీ జట్టు కార్తీక్ను సొంతం చేసుకుంది. 2022 ఐపీఎల్లో అతను బెస్ట్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆర్సీబీ ప్లేఆఫ్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. 16 మ్యాచుల్లో 330 పరుగులు సాధించాడు. ఒకే హాఫ్ సెంచరీ చేసినా..ఎన్నోసార్లు జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఐపీఎల్లో దినేష్ కార్తీక్ అద్భుతంగా రాణించడంతో...బీసీసీఐ అతన్నిసౌతాఫ్రికా టూర్కు ఎంపిక చేసింది.

దినేష్ కార్తీక్కు అసలు పరీక్ష
సౌతాఫ్రికా టూర్కు దినేష్ కార్తీక్ ఎంపికవడంతో..అతను తన క్రికెట్ కెరియర్లో  రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే కార్తీక్కు ఇప్పుడే అసలు పరీక్ష ఎదురవనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టులో చోటు దక్కించుకోవడమనేది పెద్ద టాస్క్. చోటు దక్కించుకోవడం ఒక ఎత్తయితే..స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం మరొకెత్తు. రిజర్వ్ బెంచ్లో ఎంతోమంది యంగ్ టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించి.. జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో దక్షిణాఫ్రికా సిరీస్ డూ ఆర్ డై సిరీస్ కానుంది. ఈ సిరీస్లో  కార్తీక్ రాణిస్తేనే అతను జట్టులో కొనసాగుతాడు. విఫలమైతే మాత్రం చోటు కోల్పోవడమే కాదు..అతని ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ ఎండ్ అయ్యే అవకాశాలున్నాయి. 

ఆడితేనే వరల్డ్ కప్లో చోటు
ఈ నెల 9 నుంచి సౌతాఫ్రికా టూర్ స్టార్ట్ కానుంది. అనంతరం ఐర్లాండ్తో భారత్ రెండు టి20 మ్యాచ్లు ఆడనుంది. అటు తర్వాత ఇంగ్లండ్, వెస్టిండీస్ లతో టి20 సిరీస్లలో టీమిండియా పాల్గొననుంది. టీ-20 వరల్డ్ కప్నకు ముందు భారత జట్టు 15 టీ-20 మ్యాచులు ఆడనుంది. ఈ సిరీస్లకు దినేష్ కార్తీక్ ఎంపికవ్వాలంటే..సౌతాఫ్రికా సిరీస్లో అతను తప్పక రాణించాల్సిందే. ఇందులో ఆడితేనే..తర్వాతి సిరీస్లకు ఎంపికవుతాడు. వాటిల్లో రాణిస్తేనే టీ-20 ప్రపంచ కప్లో చోటు దక్కించుకుంటాడు. కాబట్టి దినేష్ కార్తీక్కు ప్రతీ సిరీస్ అగ్ని పరీక్షే.

మరిన్ని వార్తల కోసం..

ది వారియర్ నుంచి రెండో సాంగ్ విడుదల