సదరన్ ట్రావెల్స్ చైర్మన్ వెంకటేశ్వరరావు కన్నుమూత

సదరన్ ట్రావెల్స్ చైర్మన్ వెంకటేశ్వరరావు కన్నుమూత

హైదరాబాద్, వెలుగు : సదరన్ ట్రావెల్స్ చైర్మన్, ఫౌండర్ ఆలపాటి వెంకటేశ్వరరావు బుధవారం ఉదయం ఢిల్లీలోని ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. సదరన్ ట్రావెల్స్ సంస్థను అభివృద్ధి వైపు నడిపించిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో అవార్డులను అందుకున్నారు.  

ఆలపాటి వెంకటేశ్వరరావు ఆశయాలతో సంస్థను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ఆయన కుమారులు సంస్థ ఎండీ ఏవీ కృష్ణమోహన్, జేఎండీ ఏవీ ప్రవీణ్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.