తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ(గురువారం) పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వాస్తవానికి గత రెండు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాత్రి మొదలైన  వర్షం బుధవారం సాయంత్రం వరకు కురిసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో బుధవారం(గత రాత్రి) కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.