మనం తినే ప్రతి వస్తువుకీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ రూల్ జీడిపప్పుకి కూడా వర్తిస్తుందని! జీడిపప్పు ఎలా స్టోర్ చేస్తున్నారన్న విషయం మీదే దాని ఎక్స్పైరీ డేట్ ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఎండ, వేడి, గాలి తగిలేచోట జీడిపప్పు ఉంచితే అవి త్వరగా పాడవుతాయి. బల్క్ జీడిపప్పు కొని డబ్బాలో స్టోర్ చేస్తే నాలుగు వారాలు తినొచ్చు.
అదే ఫ్రిజ్లో పెడితే ఆరు నెలలు ఫ్రెష్గా ఉంటాయి. అంతకన్నా ఎక్కువ రోజుల నిల్వ ఉండాలంటే వాటిని గాలి చొరబడని డబ్బా లేదా ఫ్రీజర్ బ్యాగ్ లో స్టోర్ చేయాలి. అలాగే కిచెన్ , ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో ఎక్కడైనా జీడిపప్పుని చల్లటి, వెలుతురు తగలని ప్రదేశంలో మాత్రమే పెట్టాలి. అవి రంగు మారితే ఎక్స్పైర్ అయినట్టు అర్థం చేసుకోవాలి. అలాగే పాడైన జీడిపప్పు పెయింట్ వాసన వస్తుంది. రుచి కూడా చేదుగా ఉంటుంది. కాస్త పుల్లగా కూడా ఉంటాయి. అలాంటప్పుడు వాటిని పారేయాల్సిందే. ఇవేం పట్టించుకోకుండా తింటే వాటిల్లోని బ్యాక్టీరియా, ఫంగస్ ఆరోగ్యానికి లేనిపోని చిక్కులు తెచ్చిపెడతాయి.
