Harmanpreet Kaur: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ముందే భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచింది. టోర్నమెంట్‌లో పాల్గొనే జట్ల కెప్టెన్లందరితో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో హర్మన్‌ప్రీత్ , ఓ మహిళా రిపోర్టర్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రిపోర్టర్ అడిగిన రిటైర్మెంట్ ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ ఘాటుగా సమాధానం ఇవ్వడంతోనే ఈ లొల్లి స్టార్ట్ అయింద.
మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ మాట్లాడుతూ.. హర్మన్‌ప్రీత్ కౌర్.. ఇది మీకు చివరి టీ20 వరల్డ్ కప్ అవుతుందా? దీనిపై మీరేమంటారు? అని క్వశ్చన్ చేసింది. ఈ ప్రశ్నతో ఒక్కసారిగా తీవ్ర అసహనానికి గురైన హర్మన్‌ప్రీత్.. ఇది నా చివరి ప్రపంచ కప్ ఎందుకు అవుతుంది?.. నేను రిటైర్మెంట్ తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారా? అని టీమిండియా కెప్టెన్ ఎదురుప్రశ్న వేసింది. దాంతో సదరు రిపోర్టర్ మాట్లాడుతూ.. లేదు నేను జస్ట్ తెలుసుకోవాలని అడిగాను.. ఇది మీ లాస్ట్ ప్రపంచకప్ కాదని వినడం నాకు సంతోషంగా ఉందని చెప్పారు. అయినప్పటికీ హర్మన్‌ప్రీత్ కౌర్ వెనక్కి తగ్గకుండా, మరి అలాంటప్పుడు అసలు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? అని నిలదీసింది.
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. లండన్‌లో జరగబోయే ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంకతో తలపడనుంది. ఇక భారత జట్టు జూన్ 14న తన పాకిస్తాన్‌తో పోటీపడనుంది. గ్రూప్ దశలో ప్రతి జట్టు ఐదేసి మ్యాచ్‌లు ఆడాల్సిందే. భారత్ ఉన్న గ్రూపులో పాక్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా టీమ్స్ ఉన్నాయి. గ్రూప్ స్టేజ్ ముగిసిన తర్వాత రెండు గ్రూపుల నుంచి టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు వెళ్తాయి.
Eyes on the prize. Focus on the goal. 🏆🇮🇳#HarmanpreetKaur and Team India are ready to give it their all on the biggest stage. 💪🔥
— Star Sports (@StarSportsIndia) June 7, 2026
ICC Women’s #T20WorldCup 2026 👉 #INDvPAK | SUN, 14th JUNE, 6 PM pic.twitter.com/EbpbhmSTa2
