తిరువనంతపురం: కేరళలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఒక వ్యక్తి పోలీసులు తనిఖీల్లో భాగంగా తన ఇంటికి వస్తున్నారని తెలిసి ఇంట్లో ఉన్న గంజాయిని ఏం చేయాలో అర్థం కాక కంగారులో చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇల్లంతా సోదాలు చేస్తారు గానీ అన్నంతో ఉండే పాత్రను సోదా చేయరని భావించి తెలివిగా ప్లాన్ చేశాడు. అయితే.. పోలీసులకు అనుమానం వచ్చి అన్నం పాత్రను కూడా తనిఖీ చేయడంతో అడ్డంగా దొరికిపోయాడు.
Kerala Thrissur man Bineesh panicked during police raid, hid 400g cannabis in a pressure cooker with rice & turned it on. Cooker whistle + ganja smell gave him away💀😭
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 7, 2026
pic.twitter.com/rWLFoD59Pq
కేరళలోని త్రిసూరుకు చెందిన బినీష్ దగ్గర 400 గ్రాముల గంజాయి ఉంది. పోలీసులు తనిఖీలకు వస్తున్నారని తెలిసి హడావిడిలో ఏం చేయాలో అర్థం కాక అన్నం ఆల్ మోస్ట్ ఉడికిన సమయంలో ప్రెజర్ కుక్కర్లో వేశాడు. ఇంతలో పోలీసులు వచ్చి ఇల్లు మొత్తం సోదాలు చేశారు. ఎక్కడా గంజాయి దొరకలేదు. వెనుతిరిగి వెళ్లిపోతున్న సమయంలో కుక్కర్ విజిల్ సౌండ్ వచ్చింది. ఆ సమయంలో కుక్కర్ నుంచి బయటికొచ్చిన ఆవిరిలో గంజాయి వాసన వచ్చింది.
►ALSO READ | బ్లింకిట్లో పాములు కూడా దొరుతున్నాయా..? స్నాక్స్ బదులు స్నేక్ ఆర్డర్ చేశారా..?
ఇదేదో తేడాగా ఉందని ప్రెజర్ కుక్కర్ పొయ్యి మీద నుంచి దించేసి అన్నం బయటకు తీసి చూశారు. అన్నం లోపల గంజాయి కవర్ కనిపించేసరికి ఈ గంజాయి స్మగ్లర్ అతి తెలివితేటలకు పోలీసులు కంగుతిన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గంజాయి బిర్యానీ చేస్తుంటే మధ్యలో పోలీసులు అడ్డుకున్నారని ఈ వీడియో చూసిన నెటిజన్లు జోకులేశారు. కేరళలోని త్రిసూర్లో గంజాయి కేసులు పెరిగిపోవడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. యువతను గంజాయి మత్తులో మునిగేలా చేస్తున్న స్మగ్లర్ల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే.. బినీష్ ఇంట్లో ఈ తనిఖీలు చేశారు.
