ముంబైకి చెందిన ఒక బ్లింకిట్ డెలివరీ ఉద్యోగి నడిరోడ్డుపై ఒక పెద్ద పామును పట్టుకుని, దానిని తన డెలివరీ బ్యాగ్‌లో పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బ్లింకిట్ పాములను కూడా డెలివరీని చేస్తున్నట్లుందని చమత్కరించారు.
A snake suddenly fell from the bag of a Delivery guy on a busy street in Mumbai in broad daylight pic.twitter.com/deVTXcoMxF
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 6, 2026
స్నాక్స్ పక్కనే స్నేక్స్ అనే ఆప్షన్ కూడా తీసుకొస్తారేమోనని కొందరు నెటిజన్లు జోకులేశారు. మరికొందరు మాత్రం.. అతను స్నేక్ క్యాచర్ అయి ఉండొచ్చని.. గతంలో డెలివరీ బాయ్గా పనిచేసిన సందర్భంలో ఆ డెలివరీ బ్యాగ్, డ్రస్ అతని దగ్గర ఉండి ఉండొచ్చని చెప్పారు. బ్లింకిట్ను వెటకారం చేస్తున్నారు గానీ చైనాలో ఒక యువతి పాముల ఫాం నడుపుతూ సంవత్సరానికి కోట్లు సంపాదిస్తుంది.
కన్నతండ్రి నమ్ముకున్న ‘పాముల’ వ్యాపారాన్నే ఎంచుకుంది చైనాకు చెందిన ఓ యువతి. పాముల ఫాం పెట్టి ఏటా రూ.కోట్లు గడిస్తోంది. ఏకంగా 60 వేల విషపు పాములను పెంచుతోంది. చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన క్విన్ అనే యువతి పాముల ఫాం వ్యాపారం చేస్తుంది.
►ALSO READ | మొన్న మంచం కింద ఒక నేత.. ఇప్పుడు చీరల కట్టల కింద మరో నేత.. బెంగాల్లో టీఎంసీ నేతల తిప్పలు !
పాముల విషం, ఎండబెట్టిన పాముకు నాణ్యతను బట్టి గ్రాముకు 40 నుంచి 200 యువాన్ల వరకు ధర ఉంటుందని, పాము మాంసం 200 నుంచి 300 యువాన్లు ఉంటుందని, పెద్ద పాములు 1,000 యువాన్లకు పైగా ధర పలుకుతున్నాయని తెలిపింది.
పాము నూనెకు చైనాలో మంచి డిమాండ్ ఉందని ఆమె పేర్కొంది. వీటిని మందుల తయారీలో (ట్రెడిషనల్ మెడిసిన్) ఉపయోగిస్తారని, ఒక్కో పాము విషానికి డిమాండ్‌ఉందని తెలిపింది. ఖర్చులన్నీ పోను ఏటా (పది లక్షల యువాన్లు) రూ.1.35 కోట్లు లాభం వస్తుందని కిన్ తెలిపింది.
