మొన్న మంచం కింద ఒక నేత.. ఇప్పుడు చీరల కట్టల కింద మరో నేత.. బెంగాల్లో టీఎంసీ నేతల తిప్పలు !

మొన్న  మంచం కింద ఒక నేత..  ఇప్పుడు చీరల కట్టల కింద మరో నేత.. బెంగాల్లో టీఎంసీ నేతల తిప్పలు !

వెస్ట్ బెంగాల్ లో అధికార మార్పిడి తర్వాత రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఇన్నాళ్లు అధికారం అనుభవించిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు పరారవ్వాల్సిన పరిస్థితి. అధికార బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అరెస్టులు, దాడులు టీఎంసీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. లేటెస్టుగా.. అరెస్టును తప్పించుకునేందుకు ఆ పార్టీ నేత చీరల కట్టల కింద దాక్కున్న ఘటన వైరల్ గా మారింది. 

హౌరాలో టీఎంసీ నేత బ్రహ్మానంద చక్రవర్తీ గుట్టలు చీరల కట్టల కింద దాక్కోవడం చర్చనీయాంశంగా మారింది. ఉదయ్ నారాయణపూర్ లోని బిల్సాపూర్ కు చెందిన నివాసితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారుల నుంచి, హౌసింగ్ స్కీమ్ లో లబ్ది దారుల నుంచి కమిషన్లు తీసుకోవడం, ఫండ్ ను నొక్కేయడం వంటి ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. 

తనకోసం పోలీసులు వస్తున్నారని తెలిసి చక్రవర్తి ఒక బట్టల దుకాణానికి చెందిన గోడౌన్ లో దూరారు. చీరలను గుట్టలు గుట్టలుగా తనపైన వేసుకుని దాక్కున్నాడు. కానీ ఆ చీరల కట్టలు అతడిని అరెస్టునుంచి తప్పించలేకపోయాయి.

గోడౌల్ లోకి ఎంటరైన పోలీసులు.. చీరల్లో దాక్కున్న నేతను బయటకు గుంజి.. స్పాట్ లోనే అరెస్టు చేశారు. ఈ అరెస్టు సీన్ అంతా కెమెరాలో రీకార్డయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్  మ ఈడియాలో వైరల్ గా మారింది. 

ఇలాంటి ఘటనే వెస్ట్ బెంగాల్ లో మరొకటి జరిగింది. కూచ్ బెహర్ లో తృణమూల్ కాంగ్రెస్ నేత షాహిదుల్ మియా.. పోలీసుల అరెస్టును తప్పించుకునేందుకు బెడ్ కింద దాక్కోవడం.. బెడ్ కింది నుంచి లాగి అరెస్టు చేయడం జరిగింది. 

బీజేపీ అధికారంలోకి వచ్చాక వెస్ట్ బెంగాల్ లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అదే విధంగా కొందరు నేతలపై దాడులు కూడా జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ తన మేనల్లుడు సహా పార్టీ నాయకులపై భౌతిక దాడులకు నిరసనగా పార్టీ చీఫ్ మమతా బెనర్జీ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీనికి తోడు పార్టీ నిలువునా చీలిపోయి.. ఏకంగా తృణమూల్ కు మేమే హక్కుదారలం అని చీలిక నేతలు ప్రకటించుకోవడం అక్కడ దీదీ భవిష్యత్తు ఏంటనే చర్చలు నడుస్తున్నాయి.