గువా హటి: నీట్ నిరసనల్లో అస్సాం మంత్రి కుమార్తె..కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

గువా హటి:  నీట్ నిరసనల్లో  అస్సాం మంత్రి కుమార్తె..కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
  •     గువాహటిలోని చాచాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఘటన

గువా హటి: నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు వ్యతరేకంగా అస్సాంలో విద్యార్థులు చేపట్టిన నిరసనల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కేశబ్ మహంత కుమార్తె దిబిసా మహంత పాల్గొనడం తీవ్ర దుమారం రేపుతోంది. గువాహటిలోని చాచాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఈ ఆందోళనల్లో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిబిసా మహంత చేతిలో ప్లకార్డు పట్టుకుని, తోటి విద్యార్థులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారాయి.  అస్సాంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ‘అస్సాం గణ పరిషత్’ కీలక భాగస్వామిగా ఉంది. 

ఆ పార్టీ అధ్యక్షుడి తర్వాత అత్యంత సీనియర్ నాయకుడైన కేశబ్ మహంత.. 2016 నుంచి రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న సీనియర్ మంత్రి కుమార్తె, కేంద్రంలోని మిత్రపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసన తెలపడం అందరి దృష్టినీ ఆకర్షించింది. తండ్రి రాజకీయ పదవితో సంబంధం లేకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆమె గొంతు విప్పడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వ్యవహారంపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ స్పందించారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని, వారి వాదనలను, డిమాండ్లను ప్రభుత్వం గౌరవిస్తుందని పేర్కొన్నారు. నీట్ అంశాన్ని ప్రధాని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెబుతూనే, ప్రస్తుతం రాష్ట్రంలోని వరదలపై అందరూ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.