శ్రీశైలం: శ్రీశైలం డ్యాం దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మలుపు దగ్గర ట్రావెల్స్ బస్సు మట్టిలో ఇరుక్కుపోయింది. దీంతో.. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దోమలపెంట చెక్‌పోస్ట్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. సున్నిపెంట వరకు వాహనాలు నిలిచిపోయాయి.
దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఎండ, ఉక్కపోతతో అల్లాడిపోయారు. బస్సును పక్కకు తీసేందుకు స్థానికుల ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న బస్సుగా ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. వీకెండ్, సమ్మర్ హాలీడేస్ అయిపోయే సమయం దగ్గర పడటంతో పిల్లలను తీసుకుని ఫ్యామిలీస్ శ్రీశైలం వెళుతున్నారు. దీంతో.. శ్రీశైలం కిటకిటలాడింది.
►ALSO READ | పెద్ద మనసు చాటుకున్న సోనూసూద్.. వనపర్తి జిల్లాలో ఉచిత అంబులెన్స్, హైదరాబాద్లో ఆటోల పంపిణీ
