నాలుగైదు రోజుల్లో కేరళకు ‘నైరుతి .. జూన్ 1 కన్నా ముందే రానున్న రుతుపవనాలు

నాలుగైదు రోజుల్లో కేరళకు ‘నైరుతి .. జూన్ 1 కన్నా ముందే రానున్న రుతుపవనాలు

న్యూఢిల్లీ:  ఈసారి నైరుతి రుతుపవనాలు ఐదారు రోజులు ముందే కేరళను తాకనున్నాయి. సాధారణంగా ఏటా జూన్ 1 నాటికి ఈ రుతుపవనాలు కేరళను చేరుకుంటాయి. ఆ తర్వాత జూన్ 8నాటికి దేశమంతటా విస్తరిస్తాయి. తర్వాత సెప్టెంబర్ 17 నుంచి ఉపసంహరణ ప్రారంభమై.. అక్టోబర్ 15 కల్లా పూర్తవుతుంది.

అయితే, ఈసారి మరో నాలుగైదు రోజుల్లోనే రుతుపవనాలు కేరళకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు మంగళవారం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రుతుపవనాల రాకకు ప్రస్తుతం పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.

ఇంతకుముందు 2009లో నైరుతి మే 23వ తేదీనాటికే కేరళ తీరాన్ని తాకింది. కాగా, 2023లో జూన్ 8న, పోయిన ఏడాది మే 30వ తేదీన నైరుతి కేరళను తాకింది.