లక్నో: అయోధ్య రామమందిరంలో భక్తుల కానుకల చోరీ ఘటనలు ప్రాథమిక విచారణలోనే 105కి చేరాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఈ అక్రమాల్లో బీజేపీ నాయకుల ప్రమేయం ఉందని విమర్శించారు. సీసీటీవీ కెమెరాల్లో ఈ దొంగతనాలు రికార్డయ్యాయని పేర్కొన్నారు.
ఓ వార్తా కథనం స్క్రీన్‌షాట్‌ను మంగళవారం సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. విరాళాల దుర్వినియోగంపై సిట్ సెప్టెంబర్ 25 నాటికి తొలి చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలపడానికి ఒక్క రోజు ముందే అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
