ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ జానకి

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ జానకి

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు పోలీస్​అధికారులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్​కార్యాలయంలో జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాత గొడవలు, ఘర్షణలకు అవకాశం ఉన్న గ్రామాలను గుర్తించి, అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. 

డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీపై నిఘా పెట్టాలని, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఫ్లయింగ్​స్క్వాడ్, స్టాటిక్​సర్వైలెన్స్​టీంలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఫిర్యాదులు అందిన వెంటనే కేసులు నమోదు చేయాలని చెప్పారు. నామినేషన్​ కేంద్రాల లోపల, బయట సీసీటీవీ పర్యవేక్షణ ఉండాలన్నారు. సోషల్‌‌‌‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేసేవారిపై, ఉద్రిక్తతలకు దారి తీసే పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏఎస్పీ రత్నం, ఏఆర్​ఏఎస్పీ సురేశ్​కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎలక్షన్ సెల్ డీఎస్పీ గిరిబాబు, ఎస్బీ డీఎస్పీ రమణా రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.