క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి : ఎస్పీ రోహిత్ రాజు

క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి : ఎస్పీ రోహిత్ రాజు
  • ఎస్పీ రోహిత్ రాజు  

చుంచుపల్లి, వెలుగు : పోలీస్ శాఖలో పనిచేసేవారు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో సోమవారం యాన్యువల్ ఇన్​స్పెక్షన్ కార్యక్రమంలో ఆయన  పాల్గొన్నారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్న ఎస్పీ  జిల్లా ఆర్మడ్ రిజర్వు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.అనంతరం అక్కడ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్ ను తనిఖీ చేశారు.

 తరువాత అడ్మిన్ ఆర్ఐ కార్యాలయం,మోటార్ ట్రాన్స్​పోర్ట్​కార్యాలయం,వెల్ఫేర్ కార్యాలయం, ఆర్ఐ హోంగార్డ్స్ ఆఫీసులలో రికార్డులను తనిఖీ చేశారు. బాంబు డిస్పోజల్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలను పరిశీలించి , ఇన్​చార్జి అధికారులకు పలు సూచనలు చేశారు.  కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ,ఎస్బీ ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్, ఎంటీవో సుధాకర్, ఆర్ఐ హోమ్ గార్డ్స్ నరసింహారావు, ఆర్ఐ అడ్మిన్ లాల్ బాబు, ఆర్ఐ వెల్ఫేర్ కృష్ణారావు పాల్గొన్నారు.