- ఎస్ఓటీ పోలీసుల దాడితో బట్టబయలు
- నిర్వాహకులతోపాటు ఇద్దరు విటులు అరెస్ట్
- ఎస్ఓటీ పోలీసుల దాడితో బట్టబయలు
- నిర్వాహకులతోపాటు ఇద్దరు విటులు అరెస్ట్
- రూ.1.36 లక్షల నగదు స్వాధీనం.. రెస్క్యూ హోంకు 6 బాధితులు
స్పా సెంటర్ పేరుతో వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న ఇద్దరిని మాదాపూర్ఎస్ఓటీ పోలీసుల సహాయంతో కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్‌చేశారు. రూ.1.36 లక్షల నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు యువతులను రెస్య్కూ హోంకు తరలించారు. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన ఎ.కృష్ణ(23), ప్రగతినగర్‌కు చెందిన సి.మౌనిక(26)తో కలిసి కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నెం.1, ఎంఐజీ59లోని ఫ్లాట్ నెంబర్202ను అద్దెకు తీసుకున్నారు. యూనివర్సల్ హెయిర్అండ్స్పా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. కొన్నిరోజుల తర్వాత ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం స్టార్ట్చేశారు. జస్ట్ డయల్, సులేఖ యాప్‌ల ద్వారా విటులను రప్పిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు, కేపీహెచ్‌బీ పోలీసులతో కలిసి శనివారం అర్ధరాత్రి దాటాక స్పా సెంటర్‌పై దాడి చేశారు. విటులు కూకట్ పల్లికి చెందిన సింహాద్రి, కొండాపూర్‌కు చెందిన గుణశేఖర్ లతో పాటు నిర్వాహకులు కృష్ణ, మౌనికలను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు యువతులను రెస్య్కూ హోంకు తరలించారు. రూ.1,36,160 నగదు, 6 సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. 
