రష్యాపై అమెరికా ఆంక్షలు

రష్యాపై అమెరికా ఆంక్షలు
  • అమెరికా బాధ్యతగా వ్యవహరించాలె: రాస్ కాస్మోస్ చీఫ్​ రోగోజిన్

మాస్కో: రష్యాపై అమెరికా ఆంక్షలు విధించడం వల్ల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) నిర్వహణ విషయంలో కోఆపరేషన్ దెబ్బతింటుందని, ఫలితంగా స్పేస్ స్టేషన్ కూలిపోయి ఇండియా మీద లేదా చైనా మీద పడొచ్చని రష్యన్ స్పేస్ ఏజెన్సీ రాస్ కాస్మోస్ చీఫ్ దిమిత్రీ రోగోజిన్ అన్నారు. ‘ఐఎస్ఎస్ కంట్రోల్ కోల్పోయి డీఆర్బిట్ అవుతూ అమెరికా మీద లేదా యూరప్ మీద కూడా కూలిపోవచ్చు. అలా జరగకుండా దానిని ఎవరు కాపాడతారు? 500 టన్నుల బరువు, ఒక ఫుట్ బాల్ ఫీల్డ్ అంత సైజు ఉన్న స్పేస్ స్టేషన్ ఇండియా మీద లేదా చైనా పైన కూలిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ప్రవర్తనతో వాళ్లను ప్రమాదంలో పడేయాలని అనుకుంటున్నారా?’ అంటూ ట్వీట్ చేశారు. అమెరికా బాధ్యతారహితంగా ప్రవర్తించొద్దన్నారు.  కాగా,  ప్రస్తుతం ఐఎస్ఎస్​లో నలుగురు అమెరికన్లు, ఇద్దరు రష్యన్లు, ఒక జర్మన్ ఆస్ట్రోనాట్ కలిసి పనిచేస్తున్నారు. రష్యాపై ఆంక్షలకు, ఐఎస్ఎస్ నిర్వహణకు ఎలాంటి సంబంధంలేదని, ఈ విషయంలో రష్యాతో కోఆపరేషన్ యథావిధిగా కొనసాగుతుందని నాసా స్పష్టం చేసింది.