స్పేస్ నుంచి ఉల్కల్లా రాలిపడుతున్న స్పేస్ఎక్స్ శాటిలైట్లు

స్పేస్ నుంచి ఉల్కల్లా రాలిపడుతున్న స్పేస్ఎక్స్ శాటిలైట్లు

స్పేస్ నుంచి ఉల్కల్లా రాలిపడుతున్నట్లు కన్పిస్టున్న ఇవి స్పేఎస్ఎక్స్ శాటిలైట్లు. ప్రపంచమంతా ఇంటర్నెట్ సర్వీసుల కోసం ఆ కంపెనీ ఇదివరకే 2 వేల స్టార్ లింక్ శాటిలైట్లను నింగికి పంపింది. ఇటీవల మరో 49 శాటిలైట్లను పంపగా.. వాటిలో 40 శాటిలైట్లు ఇలా నేలరాలాయి. సోలార్ స్టార్మ్ ప్రభావం వల్ల తమ శాటిలైట్లు దెబ్బతిన్నాయని.. భూమిపై కూలిపోవచ్చని, ఎవరికీ ప్రమాదం మాత్రం ఉండబోదని మంగళవారమే ఆ కంపెనీ ప్రకటించింది. అయితే శాటిలైట్లు భూవాతావరణంలోకి ఎంటరై ఇలా మండిపోయిన దృశ్యాలను ప్యూర్టోరికోకు చెందిన ఆస్ట్రోనోమియా డెల్ కరీబ్ సంస్థ వీడియోలో బంధించింది. ఈ ప్రమాదంతో  కంపెనీకి రూ. 751 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా.