‘స్టెబిలైజేషన్ దశ’లో స్పెయిన్.. నెమ్మదిగా తగ్గుతున్న మరణాలు

‘స్టెబిలైజేషన్ దశ’లో స్పెయిన్.. నెమ్మదిగా తగ్గుతున్న మరణాలు

మాడ్రిడ్​ : స్పెయిన్ లో కరోనా మరణాలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. శుక్రవారం 510 మంది చనిపోయారు. మార్చి 23 నుంచి ఒకరోజులో ఇంత తక్కువ మంది చనిపోవడం ఇదే మొదటిసారి. శనివారం నాటికి స్పెయిన్ లో 1,61,852 కేసులు, 16,353 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 4,830 కేసులు కన్ఫమ్ అయ్యాయి. అయితే దేశంలో కొత్త కేసులు, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోందని, ప్రస్తుతం దేశంలో కరోనా ‘స్టెబిలైజేషన్ దశ’లో ఉందని అధికారులు చెప్పారు.