
విక్రాంత్, మెహరీన్, రుక్సర్ థిల్లాన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘స్పార్క్’. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ దర్శకనిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హృదయం’ ఫేమ్ హేషం అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
బుధవారం టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో చేతిలో మాస్క్‌తో విక్రాంత్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో మలయాళ నటుడు గురు సోమసుందరం కీలకపాత్ర పోషిస్తున్నాడు. నాజర్, సుహాసిని, వెన్నెల కిషోర్, సత్య ఇతర పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానుంది.