అనంతగిరిని టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దుతా :స్పీకర్ ప్రసాద్

అనంతగిరిని టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దుతా :స్పీకర్ ప్రసాద్
  • అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 

వికారాబాద్, వెలుగు : రూ. 500 కోట్లతో అనంతగిరిని టూరిస్టు స్పాట్ గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. సోమవారం ధారూర్ మండల కేంద్రంలోని శుభం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు సంతోషంగా లేరని, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందన్నారు. 

 ధారూర్ మండలాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. రూ. 110 కోట్లతో కోట్ పల్లి ప్రాజెక్ట్ ఆధునీకరణ, ఉద్యోగులను నియమిస్తూ అభివృద్ధి చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ షాహీదా బేగం, ఎంపీడీవో నర్సింహులు, ఎంపీవో షఫీ ఉల్లాఖాన్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మండల కాంగ్రెస్ సీనియర్ నేతలు , కార్యకర్తలు పాల్గొన్నారు.