ప్రభుత్వం రైస్​మిల్లర్లకు అన్యాయం చేయదు : మంత్రి గంగుల కమలాకర్​

ప్రభుత్వం రైస్​మిల్లర్లకు అన్యాయం చేయదు : మంత్రి గంగుల కమలాకర్​
  • మంత్రి గంగుల కమలాకర్​ 

బాన్సువాడ, వెలుగు: రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని పలువురు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు శనివారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​ను కోరారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. ప్రభుత్వం రైస్​ మిల్లర్లకి అన్యాయం చేయదని అన్నారు.

ALSO READ:  కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు అందుకున్న ఐలయ్య

బీఆర్​ఎస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైస్ మిల్లర్లకు మేలు జరిగిందని, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు వారిని దొంగళ్లా చూశాయని పేర్కొన్నారు.  సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రైస్ మిల్లర్ల అసోసియన్ నాయకులు వెంకన్న, ఎరవల కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.