8వ తేదీ నుంచి వంద హాస్పిటల్స్​లో మహిళలకు స్పెషల్​ క్లినిక్స్ సేవలు

8వ తేదీ నుంచి వంద హాస్పిటల్స్​లో మహిళలకు స్పెషల్​ క్లినిక్స్ సేవలు
  • ప్రతి మంగళవారం నిర్వహించనున్న రాష్ట్ర సర్కార్
  • ఫీమేల్ డాక్టర్లు, స్టాఫ్​తోనే నిర్వహణ

హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్ హాస్పిటల్స్​లో ప్రతీ మంగళవారం మహిళల కోసం ప్రత్యేక క్లినిక్‌‌‌‌‌‌‌‌లు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఈనెల 8వ తేదీన వుమెన్స్ డే సందర్భంగా వంద హాస్పిటల్స్​లో అధికారికంగా ఈ ప్రోగ్రాం ప్రారంభించేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. తర్వాత వారం నుంచి 1,200 దవాఖానల్లో స్పెషల్ క్లినిక్‌‌‌‌‌‌‌‌లను నిర్వహించనున్నారు. ఫీమేల్‌‌‌‌‌‌‌‌ డాక్టర్లు, ఫీమేల్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌తో నడిచే ఈ క్లినిక్స్​లో అన్ని వయసుల మహిళలకు ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇస్తారు. మహిళలు ఎదుర్కొంటున్న 8 రకాల సమస్యలను డాక్టర్లు గుర్తించారు. క్లినిక్‌‌‌‌‌‌‌‌కు వచ్చే ప్రతీ మహిళకు వీటికి సంబంధించిన స్ర్కీనింగ్, టెస్టులు చేయనున్నారు. ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నట్టు తేలితే వెంటనే మెడిసిన్ అందజేస్తారు. ఇంకేమైనా టెస్టులు, ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, సర్జరీలు అవసరం అనుకుంటే పెద్ద దవాఖానకు రిఫర్ చేస్తారు. ఒక్కో జిల్లాకు ఒక్కో రిఫరల్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేశారు. ఇతర హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ నుంచి రిఫరల్‌‌‌‌‌‌‌‌పై వచ్చే మహిళలకు సాయం చేసేందుకు ఈ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో హెల్ప్ డెస్క్​లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక్కడి నుంచి అవసరమైన నిమ్స్‌‌‌‌‌‌‌‌, గాంధీ, ఉస్మానియా వంటి టెర్షియరీ కేర్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌కు రిఫర్ చేస్తారు. 

అందుబాటులోకి స్పెషల్ యాప్​

వుమెన్స్ క్లినిక్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ప్రత్యేకంగా ఒక యాప్ తయారు చేయించారు. క్లినిక్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన మహిళల వివరాలు, వారి అనారోగ్య సమస్యలు, చేసిన టెస్టులు, వారికి ఇచ్చే మెడిసిన్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రిఫరల్ వివరాలన్నీ ఈ యాప్‌‌‌‌‌‌‌‌లో ఉంటాయి. ప్రతి క్లినిక్‌‌‌‌‌‌‌‌లోనూ న్యూట్రిషన్ డెఫిషియన్సీ, క్యాన్సర్, యూరిన్ ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లమేటరీ డిసీజ్‌‌‌‌‌‌‌‌, హార్మోన్ల డెఫిషియన్సీ, ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్టిలిటీ, పోస్ట్ హిస్టరెక్టమీ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌, అయోడిన్‌‌‌‌‌‌‌‌, విటమిన్ డీ3, బీ12 స్క్రీనింగ్‌‌‌‌‌‌‌‌, మోనోపాజ్ సమస్యలను గుర్తించే టెస్టులు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. స్కానింగ్స్ చేసేందుకు ఫీమేల్ రేడియోగ్రాఫర్లు నియమించాలని నిర్ణయించారు. 

క్యాన్సర్లపై స్పెషల్ ఫోకస్‌‌‌‌‌‌‌‌

రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళలు ఓరల్, సర్వికల్, బ్రెస్ట్ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలు, యూపీహెచ్‌‌‌‌‌‌‌‌సీలు, బస్తీ దవాఖాన్లలో ప్రతీ మంగళవారం ఫీమేల్ మెడికల్ ఆఫీసర్లు మహిళలను పరీక్షించి, క్యాన్సర్​ సింప్టమ్స్ ఉన్నాయో.. లేవో గుర్తిస్తారు. సింప్టమ్స్ ఉన్న వారిని జిల్లా హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌కు రిఫర్ చేయనున్నారు. జిల్లా హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో మామోగ్రామ్, కల్పోస్కోపి, క్రయోథెరపీ, పాప్‌‌‌‌‌‌‌‌స్మియర్, బయాప్సి వంటి పరీక్షలు చేయిస్తారు. ఒకవేళ క్యాన్సర్​ ఉన్నట్టు తేలితే నిమ్స్‌‌‌‌‌‌‌‌ లేదా ఎంఎన్‌‌‌‌‌‌‌‌జే క్యాన్సర్​ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ చేయిస్తారు.