వధూవరులకు స్పెషల్ పూల మాస్కులు  

V6 Velugu Posted on Aug 13, 2021

పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పార్టీలు... దేనికి వెళ్లినా మాస్క్​ ఉండాల్సిందే. అంతలా అందరి జీవితంలో కలిసిపోయిన మాస్క్​లు స్టైల్​ సింబల్ అవుతున్నాయి. అంతేకాదు సిచ్యుయేషన్​కి మ్యాచ్​ అయ్యే మాస్కులు పెట్టుకునే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అలాంటివే ఈ ‘ఫ్లోరల్​ మాస్కులు’. పెళ్లికూతురు, పెళ్లికొడుకు కోసం 
ప్రత్యేకంగా తయారుచేసిన ఈ పూల మాస్కులు మధురైలో దొరుకుతున్నాయి.

తమిళనాడులోని  మధురైకి చెందిన మోహన్​ అనే పూల వ్యాపారి. మీనాక్షి టెంపుల్​ దగ్గర్లోని చిన్న పూల దుకాణంలో పెళ్లి దండలు అమ్ముతుంటాడు. లాక్​డౌన్​లో పెళ్లిళ్లు వాయిదా పడి పూలకి గిరాకీ లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ పెళ్లిళ్ల సందడి షురూ కావడంతో తనవంతు ప్రయత్నంగా ‘అందరికీ కరోనా జాగ్రత్తలు చెప్పాలి’ అనుకున్నాడు. పూల దండలతో పాటు పెళ్లికూతురు, పెళ్లికొడుకు కోసం స్పెషల్​గా మూడు పొరల ‘ఫ్లోరల్ మాస్క్​లు’ కుట్టడం మొదలు పెట్టాడు. ఇలా ఎందుకంటే... ‘పెళ్లికొడుకు, పెళ్లికూతురు మాస్కులు పెట్టుకుంటే, పెళ్లికి వచ్చిన వాళ్లంతా మాస్కులు పెట్టుకుంటారు’ అనేది మోహన్​ ఆలోచన. మూడు పొరలున్న  ఈ మాస్కుల్ని.. మొదటి పొరలో క్లినికల్​ మాస్క్​, రెండో పొరలో మందార పూలు, మూడో పొరలో మల్లె మొగ్గలు, ఆకుని పేర్చి తయారుచేశాడు. అతడు అనుకున్నట్టుగానే ‘ఫ్లోరల్​ మాస్క్​లు’ నిజంగా మ్యాజిక్​ చేస్తున్నాయి.  పెళ్లి దండలు కొనేందుకు వచ్చిన వాళ్లు ఈ కలర్​ఫుల్​గా ఉన్న  ఫ్లోరల్​ మాస్కుల్ని చూసి ముచ్చటపడి మరీ కొంటున్నారు. మధురై చుట్టుపక్కల జరిగే పెళ్లి వేడుకల్లో కొత్తదంపతులు పూల మాస్కులు పెట్టుకుని మెరిసిపోతున్నారు.

Tagged tamilnadu, coronavirus, madurai, marriage, floral mask, flower mask

Latest Videos

Subscribe Now

More News