
- ఇక రోగాలపై స్పెషల్ ఫోకస్
- ఐహెచ్‌ఐపీ విధానాన్ని తెస్తున్న కేంద్రం
- ఫైలెట్ ప్రాజెక్టుగా మన రాష్ట్రంలో సక్సెస్
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా రోగాల వ్యాప్తిపై కేంద్రం ఇక నుంచి స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. ఒకే పోర్టల్ ద్వారా హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని అన్ని డిపార్ట్ మెంట్లకు వ్యాధుల వివరాలు తెలిసేలా ప్రత్యేక సిస్టమ్ రెడీ చేశారు. ఈ పోర్టల్ ద్వారా రోగాలపై రోజు మానిటరింగ్ కొనసాగించి వ్యాధుల తీవ్రత పెరగకుండా అడ్డుకోవచ్చని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫాం(ఐహెచ్‌ఐపీ) అనే సిస్టమ్ ద్వారా అన్ని విభాగాలను అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే మన రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఇది సక్సెస్ అవడంతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ఆరోగ్యశాఖ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు బీఆర్‌కే భవన్‌లో మీటింగ్ పెట్టారు. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ లో భాగంగా కేంద్ర ఆరోగ్యశాఖ వ్యాధుల కంట్రోల్ కోసం స్పెషల్ సాఫ్ట్‌వేర్‌ను రెడీ చేసింది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న వ్యాధుల వివరాలు ఇక ఒకే ఫ్లాట్‌ఫామ్ పైకి రానున్నాయి. దేశంలో ఎక్కడైనా పీహెచ్‌సీకి వచ్చే పేషెంట్ వివరాలను ఈ వెబ్ పోర్టల్‌లో ఎంట్రీ చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులంతా వీటిని పరిశీలించవచ్చు. దీంతో హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని అన్ని విభాగాల కోఆర్డినేషన్‌తో వ్యాధుల కంట్రోల్‌కు చర్యలు తీసుకోవచ్చని ఆరోగ్యశాఖ చెప్తోంది.
For More News..