దిశ నిందితుల డెడ్ బాడీలకు ఇంజక్షన్లు

దిశ నిందితుల డెడ్ బాడీలకు ఇంజక్షన్లు

గాంధీ ఆస్పత్రిలో మార్చురీలో ఉన్న నిందితుల డెడ్ బాడీలు పాడవకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దిశ నిందితుల డెడ్ బాడీలకు ప్రత్యేక ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఒకసారి ఇంజక్షన్ ఇస్తే వారం రోజుల వరకు అది పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు. డెడ్ బాడీలకు ఇచ్చే ఒక ఇంజక్షన్ ఖరీదు ఏడు వేల ఐదు వందలు రూపాయలు. కోర్టు ఆదేశాలు వచ్చే వరకు డెడ్ బాడీలను భద్రపరుస్తామని చెబుతున్నారు పోలీసులు.

దిశా కేసులో  విచారణ ముమ్మరంగా సాగుతోంది. కేసులో  FSL రిపోర్ట్  కీలకంగా మారింది.  దిశ  డెడ్ బాడీలో ఆల్కహాల్ ను  గుర్తించారు  ఫోరెన్సిక్ నిపుణులు. అటు నిందితుల  DNA రిపోర్టులోనూ  కీలక అంశాలపై ఆరా తీస్తున్నారు. నిందితుల  పాత నేరాలకు  సంబంధించి చిట్టాను తవ్వుతున్నారు  సైబరాబాద్ పోలీసులు.  విచారణలో భాగంగా… లారీ ఓనర్ ఇచ్చిన  సమాచారంతో… ఐదు రోజులుగా  ఆధారాలు సేకరిస్తున్నారు.  లారీ  లోడింగ్  అన్  లోడింగ్  చేసే ప్రాంతాల్లో  గతంలో ఎక్కడైనా  నేరాలకు  పాల్పడ్డారా  అనే అంశాలపై  కూపీ  లాగుతున్నారు.

More News

ఆడ, మగ అంగీకారంతోనే రేప్‌లు: పోలీస్ వివాదాస్పద వ్యాఖ్యలు
9 గంటల నిద్ర చాలా డేంజరే!
ప్రతిభగల విద్యార్థులకు ఎల్ఐసీ అందిస్తున్న ఆర్థిక సాయం