గ్రహణ సమయంలో ఓయూలో ప్రత్యేక భోజనాలు

గ్రహణ సమయంలో ఓయూలో ప్రత్యేక భోజనాలు

ఈ ఏడాదిలో చివరిది అయిన సూర్యగ్రహణం ప్రపంచంలో కొన్ని ఏరియాల్లో సంపూర్ణంగా.. మరికొన్ని చోట్ల పాక్షికంగా ప్రభావం చూపించింది. ప్రపంచవ్యాప్తంగా సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు మొదలైన గ్రహణం 5 గంటల 43 నిమిషాల దాకా కొనసాగింది.  యూరప్ దేశాలు, గల్ఫ్ ప్రాంతాలు, ఆఫ్రికాలోని ఈశాన్య ఏరియాలు, ఆసియాలోని పశ్చిమ, మధ్య ప్రాంతాలు, నార్త్ అట్లాంటిక్ ఏరియాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. మన దేశంలోని చాలా ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడింది. ఢిల్లీలో గంటా 13 నిమిషాల పాటు, ముంబైలో గంటా 19 నిమిషాల పాటు సూర్యగ్రహణం కొనసాగింది.  చెన్నైలో 31 నిమిషాలు ఉంటే... కోల్ కతాలో 12 నిమిషాలు మాత్రమే కనిపించింది.  జమ్ముతో పాటు, లక్నోలో సాయంత్రం 4 గంటల 36 నిమిషాల నుంచి 5.29 నిమిషాల దాకా కొనసాగింది.

జన విజ్ఞాన వేదిక అవగాహన కార్యక్రమాలు

గ్రహణం చూసేందుకు చాలా ఏరియాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొందరు విద్యార్థులు, యూత్  బిర్లా ప్లానిటోరియం దగ్గర సూర్యగ్రహణాన్ని చూశారు. సైంటిస్టుల సూచనలతో  ఫిల్మ్స్ ల ద్వారా గ్రహణాన్ని చూశారు. ఈఏడాదికి ఇదే చివరి సూర్యగ్రహణం. మళ్ళీ 2027లో ఆగస్టు 2న సంభవిస్తుంది. ఆ తర్వాత భారత్ లో సంపూర్ణ సూర్యగ్రహణం 2031లో మే 21న ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యగ్రహణం సందర్భంగా హైదరాబాద్ లోని ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర జన విజ్ఞాన వేదిక సభ్యులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలు మూఢనమ్మకాలు నమ్మొద్దని అవేర్ నెస్ కల్పించారు. గ్రహణం సమయంలో భోజనం చేశారు. రాష్ట్రంలో మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

గంట పాటు సూర్యగ్రహణం

దాదాపు గంటపాటు ఇక్కడ సూర్యగ్రహణం ప్రభావం కనిపించింది. చండీగఢ్ లో ఎఫెక్ట్ తక్కువగా ఉంది. అమృత్ సర్ తో పాటు నోయిడా, రాంచీ లాంటి సిటీల్లో  చీకట్లు కమ్మాయి. దేశంలో చాలా ఏరియాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపించింది. అటు ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం సూర్యగ్రహణం ప్రభావం అంతగా లేదు.  అండమాన్ నికోబార్ దీవులతో పాటు ... ఐజ్వాల్, డిబ్రూగఢ్, ఇంఫాల్, ఈటానగర్, కోహిమా, సిల్చార్ లాంటి నగరాల్లోనూ గ్రహణం చాలా తక్కువగా ప్రభావం చూపించింది. హైదరాబాద్ లో పాక్షిక సూర్యగ్రహణం ముగిసింది. సాయంత్రం 4 గంటల 49 నిమిషాలకు మొదలైన గ్రహణం, దాదాపు 45 నిమిషాలకు పైగా కొనసాగింది. ఈ ఎఫెక్ట్ 6 గంటల 26 నిమిషాల దాకా ఉంది.