చిరుతపులుల కోసం న‌మీబియాకు ప్రత్యేక విమానం

చిరుతపులుల కోసం న‌మీబియాకు ప్రత్యేక విమానం

అరుదైన చిరుత పులులను కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికా ఖండం నుంచి మన దేశానికి తీసుకురానుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ విమానాన్ని న‌మీబియా రాజధాని విండ్‌హోక్ కు పంపింది. వెరైటీగా, పులి ఫేస్ తో  అలంకరించిన  బి747 జంబోజెట్ విమానం ఫొటోలను నమీబియాలోని భారత హైకమిషన్ కార్యాలయం విడుదల చేసింది.

న‌మీబియా నుంచి మొత్తం 8 చిరుతపులులను ఇండియాకు తీసుకొస్తున్నారు. ఇందులో ఐదు ఆడ, మూడు మగ చిరుతలు ఉన్నాయి.  బి747 జంబోజెట్ విమానం చీతాలతో బయలుదేరి 16 గంటలు ప్రయాణించి జైపూర్‌లో ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి మ‌ధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు చిరుతలను తరలిస్తారు.  

సెప్టెంబరు 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆ ఆఫ్రికా పులులను స్వయంగా ప్రధాని మోడీ కునో నేషనల్ పార్క్ లోకి  రిలీజ్ చేయ‌నున్నారు.  దేశంలో చిరుతలు అంతరించిపోయాయని 1952లో  భారత ప్రభుత్వం ప్రకటించింది. వాటి పునరుద్ధరణ కోసం పునరుత్పత్తి ప్రాజెక్టును చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.