ఓటర్లను ఆకట్టుకోవడానికి..స్పెషల్​ పోలింగ్​ కేంద్రాలు

ఓటర్లను ఆకట్టుకోవడానికి..స్పెషల్​ పోలింగ్​ కేంద్రాలు

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ ​శాతం పెంచడానికి ఎలక్షన్ ​కమిషన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి పలు జిల్లాల్లో ఆదర్శ పోలింగ్ ​కేంద్రాలను ఏర్పాటు చేశారు.  మహిళల కోసం ఉమెన్​ పోలింగ్​ స్టేషన్స్​, యువత కోసం యూత్​ పోలింగ్ కేంద్రాలు, వికలాంగుల కోసం ప్రత్యేక పోలింగ్​సెంటర్లను ఏర్పాటు చేశారు. మహిళా పోలింగ్​స్టేషన్లలో సిబ్బంది కూడా మహిళలే కాగా, యూత్ ​పోలింగ్​ కేంద్రాల్లో యువతను స్టాఫ్​గా నియమించారు.  

ఈ సెంటర్లలో ప్రత్యేకంగా షామియానాలు వేయడంతో పాటు పూలతో అలంకరించారు. బెలూన్స్​తో డెకరేట్​ చేశారు. బాలింతలకు స్పెషల్​ రూమ్స్​ ఏర్పాటు చేశారు. తల్లులు తమ పిల్లలతో వస్తే చిన్నారులు ఆడుకునేందుకు క్రీడా పరికరాలు అందుబాటులో ఉంచారు. ఎండ నుంచి ఉపశమనానికి కూలర్లు పెట్టారు. వికలాంగులను పోలింగ్​కేంద్రాలకు తీసుకువెళ్లేందుకు ఆటోలను సిద్ధం చేశారు. కొన్ని చోట్ల సెల్ఫీ పాయింట్స్​ ఏర్పాటు చేశారు. - వెలుగు నెట్​వర్క్​