ఏడ్చేందుకు ఓ గది.. ‘రండి.. ఏడ్వండి’ అంటూ ఆఫర్లు

ఏడ్చేందుకు ఓ గది.. ‘రండి.. ఏడ్వండి’ అంటూ ఆఫర్లు

సమస్య చిన్నదైనా పెద్దదైనా.. ఏడిస్తే ఆ బాధ కొంతైనా తీరి మనసుకు ఊరట కలుగుతుందంటారు పెద్దలు. ఇప్పుడు ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు స్పెయిన్‌‌ కు చెందిన సైకియాట్రిస్ట్​లు. ఒత్తిళ్లు, సమస్యలను సాల్వ్ చేసేలా ‘రండి ఏడవండి’ అనే ట్యాగ్‌‌లైన్‌‌తో ఓ పింక్‌‌ రూమ్‌‌ను రెడీ చేశారు. సమస్యలతో బాధపడుతున్న ఎవరైనాసరే ఆ గదిలోకి వెళ్లి.. కావాల్సినంత సేపు బాధతీరే వరకూ గట్టిగా ఏడ్చేయొచ్చట. అలాగే ఎవరికైనా తమ బాధ చెప్పుకోవాలంటే అక్కడ ఉన్న ఫోన్‌‌లో తమ బాధను వెళ్లగక్కొచ్చట. అలా చేయడం వల్ల ఒత్తిడి దూరమై కాస్త ఉపశమనం కలుగుతుందని సైకియాట్రిస్ట్‌‌లు అంటున్నారు. దీని వల్ల ఆత్మహత్యల సంఖ్య తగ్గుతుందని చెబుతున్నారు. ఇదంతా ఎందుకంటే.. స్పెయిన్‌‌లో చాలా మంది చిన్న వయసులోనే మానసిక ఒత్తిడికి గురవుతూ సూసైడ్‌‌లు చేసుకుంటున్నారు. అక్కడి గవర్నమెంట్‌‌ డేటా ప్రకారం ప్రతి పది మందిలో ఒకరు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. దీనికి పరిష్కార మార్గంగా అక్కడి గవర్నమెంట్‌‌ సెంట్రల్‌‌ మాడ్రిడ్‌‌ హౌస్‌‌లో వెల్‌‌కమ్‌‌ టు లా ల్లోరెరియా అనే క్రైయింగ్‌‌ రూమ్‌‌ ప్రాజెక్ట్‌‌ను చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌‌లో ఎవరైనా పాల్గొనవచ్చు. తమ బాధలను ఇతరులతో పంచుకోవచ్చు. ఓ వారంలో దీనికి వచ్చిన రెస్పాన్స్‌‌ చూసిన స్పెయిన్‌‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌‌ వంద మిలియన్‌‌ యూరోలను ఖర్చు పెడుతూ మెంటల్‌‌ హెల్త్‌‌ కేర్‌‌‌‌ డ్రైవ్‌‌ను అనౌన్స్‌‌ చేశారు. సమస్యలతో బాధపడేవారికి 24 గంటలు అందుబాటులో ఉండేలా సూసైడ్‌‌ హెల్ప్‌‌లైన్‌‌ను ఏర్పాటు చేశారు. పబ్లిక్‌‌ తమ సమస్యలను చర్చించుకోవాలని, దానికి ఇదే సరైన దారి అని ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు.