అమెజాన్ బిజినెస్ కస్టమర్లకు ప్రత్యేక సేల్

అమెజాన్ బిజినెస్ కస్టమర్లకు ప్రత్యేక సేల్

హైదరాబాద్​, వెలుగు: ఈ–కామర్స్​కంపెనీ అమెజాన్ బిజినెస్ ఆర్థిక సంవత్సరం ముగింపు సేల్ ప్రారంభించింది. వ్యాపార సంస్థలు తమ వార్షిక కొనుగోళ్లను పూర్తి చేయడానికి ఇది మంచి అవకాశం. ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లు, ఆఫీసు ఫర్నిచర్, పారిశ్రామిక ఉత్పత్తులపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి.

 ఎంపిక చేసిన కేటగిరీలపై రూ.9,999 వరకు క్యాష్‌‌‌‌‌‌‌‌బ్యాక్ పొందే వీలుంది. వడ్డీ లేని క్రెడిట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.  కొత్త కస్టమర్ల  వెరిఫికేషన్ సమయం 30 శాతం తగ్గింది. మల్టీ యూజర్ అకౌంట్స్, జీఎస్​టీ ఇన్‌‌పుట్ క్రెడిట్ వంటి ఫీచర్లు వ్యాపారులకు ఎంతో మేలు చేస్తాయని అమెజాన్​  తెలిపింది.