ఇవాళ్టి నుంచి గ్రామాల్లో శానిటేషన్ డ్రైవ్

ఇవాళ్టి నుంచి గ్రామాల్లో శానిటేషన్ డ్రైవ్
  •     ఈ నెల14 వరకు రాష్ర్ట వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు
  •     రోజువారీ పనులపై గైడ్ లైన్స్ జారీ 

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో  బుధవారం నుంచి వారం పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ మొదలు కానుంది. ఈ నెల14 వరకు జరిగే ఈ కార్యక్రమంలో రోజు వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై పంచాయతీ రాజ్ అధికారులు జిల్లా పంచాయతీ ఆపీసర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ డ్రైవ్ ముగిసిన తర్వాత ఈనెల15న ప్రత్యేకంగా గ్రామ సభ నిర్వహించి వారం పాటు జరిగిన పనులపై అధికారులు రివ్యూ చేయనున్నారు. డ్రైవ్ కు ముందు, వారం తర్వాత ఫొటోలు తీసి పంచాయతీల వారీగా పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లు డీపీవోలకు పంపాలని అధికారులను ఆదేశించారు. 

 ఫిబ్రవరి 7న గ్రామాల్లో పర్యటించి సమస్యలు గుర్తించి నోట్ రెడీ చేయడం, రోడ్లను క్లీన్ చేయడం, గుంతలు పూడ్చడం, పిచ్చి మొక్కల తొలగింపు చేపట్టాలి. 8న డ్రైనేజీల్లో పూడికతీత, నీళ్లు నిల్వకుండా చేయడం, అంగన్ వాడీలు, స్కూళ్లు, మార్కెట్లు, బస్టాండ్లు క్లీన్ చేయడం, శిథిలావస్థకు చేరిన పాత బిల్డింగ్ లను కూల్చివేయాలి. 9న డెంగ్యూ వ్యాప్తి చెందకుండా దోమల వివారణకు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించడం,  ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడం చేయాలి. 10న పనికిరాని బావులను, పనిచేయని బోరు బావులను గుర్తించి పూడ్చి వేయడం, దోమల నివారణ మందు, ఫాగింగ్ చేపట్టాలి.