అయోధ్య రాముడి వేడుక స్పెషల్: సరయూ నదిలో సోలార్ బోట్..

అయోధ్య రాముడి వేడుక స్పెషల్: సరయూ నదిలో సోలార్ బోట్..

అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్టాపన వేడుకలకు అయోధ్య సిద్దమవుతోంది. జనవరి 22 న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వేడుకల సన్నాహాల్లో భాగంగా  అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంతే కాదు అయోధ్య నగరాన్ని మోడల్ సోలార్ సిటీగా మారుస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. 

సరయూ నదిలో సోలార్ బోట్ 

రామయ్య ప్రాణ ప్రతిష్ట వేడుకకు వచ్చే భక్తుల కోం సరయూ నదిలో సూర్య శక్తితో నడిచే ఎలక్ట్రిక్ బోట్ ప్రారంభించారు. నదిలో సోలార్ బోట్ ను ప్రవేశపెట్టడం దేశంలోనే ఇది మొదటిసారి. ఇది పర్యావరణ అనుకూల బోట్. దీనిని  యూపీ ప్రభుత్వానికి చెందిన న్యూ ఎనర్జీ డెవలప్ మెంట్ అథారిటీ , పుణేకు చెందిన పడవ తయారీ సంస్థ కలిసి తయారు చేశారు. అయోధ్య తర్వాత వారణాసిలోని గంగా నదిలో కూడా సోలార్ బోట్ ను ప్రారంభించనున్నారు. 

ఈ ఎలక్ట్రిక్ సోలార్ బోట్ లో 30 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. సరయూ నదిపై ఉన్న అయోధ్య కొత్త ఘాట్ నుంచి ఈ పడవ నడుస్తుంది. భక్తులు 45 నిమిషాల్లో అయోధ్య చేరుకోవచ్చు. సరయూ నది ఒడ్డున ఉన్న చారిత్ర దేవాలయాలు, వారసత్వ ప్రదేశాలను చూడొచ్చు. ఫుల్ ఛార్జింగ్ తో సోలార్ బోట్ 5 నుంచి 6 గంటల పాటు నడుస్తుంది. 

 ఈ సోలార్ బోట్ లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. పడవలో 550 వాట్ల శక్తిని ఉత్పత్తి చేసే 3.3 కిలో వాట్ రూఫ్ టాప్ సౌర ఫలకాలుంటాయి. 46 కిలో వాట్- గంట బ్యాటరీతో రన్ అయ్యే 12 వోల్ట్ ట్విన్ మోటార్ ను కలిగి ఉంటుంది. అదనంగా రిమోట్ ద్వారా చూసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎక్కడ నుంచైనా దీనిని చూడొచ్చు.