
కళ్లతో ఎర్రగా ఉరిమితే కోపం... కన్నీళ్ల నుంచి చల్లగా నీళ్లు జారితే బాధ.. పువ్వులా విచ్చుకుంటే సంతోషం... ఏ ఎమోషన్ అయినా సరే.. కళ్లు చెప్పకనే చెప్పేస్తాయి. ఇప్పుడు కళ్ల గురించి ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే.. వరల్డ్ సైట్ డే .. ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో గురువారం (2025 అక్టోబర్ 9). ఐకేర్, బ్లైండ్ నెస్ మీద అవేర్ నెస్ కల్పించడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సెలబ్రేట్ చేస్తుంది. మానవ జీవితంలో కీలక పాత్ర పోషించే కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. . .
బ్లాక్ అండ్ వైట్ కళ్లు.. ఎన్నో రంగురంగుల చిత్రాలకు కాన్వాస్.... అందమైన ప్రపంచాన్ని చూపించే అద్దాలూ ఇవే.... జ్ఞాపకాలను బంధించే కెమెరాలు కూడా ఇవే.... అంతేనా, కళ్లకు ఎన్ని భాషలు వచ్చో.... అవి చెట్లూ చేమలతో, పక్షులూ జంతువులూ, నదులూ సెలయేర్లతో మాట్లాడగలవు... ఎదుటి మనసుతో మాట్లాడి ఓదార్చగలవు.
ప్రతి సంవత్సరం, అక్టోబర్ రెండవ గురువారం నాడు ( 2025 అక్టోబర్ 9) ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని జరుపుకుంటారు. కంటి ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం దీని ప్రధాన లక్ష్యం. తరచుగా, కంటి చూపును మెరుగుపరచడం గురించి మనం ఆలోచించినప్పుడు, క్యారెట్లు మొదట గుర్తుకు వస్తాయి. క్యారెట్లు మన కళ్ళకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయనేది నిజమే, కానీ మన కంటి చూపును మెరుగుపరిచే అనేక ఇతర ఆహారాలు ఉన్నాయి.
కంటిని కాపాడే విటమిన్లు .. ప్రోటీన్స్ అధికంగా లభించే అనేక సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. ఇవి దృష్టిని కాపాడమే కాదు.. కళ్ళను కూడా ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కళ్ళకు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్ , ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి అనేక ఇతర పోషకాలు కూడా అవసరం.
సరైన పోషకాహారం లేకపోవడం వల్ల కళ్ళు పొడిబారడం, రెటీనా దెబ్బతినడం విజన్ తగ్గిపోవడం వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. క్యారెట్‌తో పాటు నాలుగు రకాల ఆహారాలను తీసుకుంటే కళ్ళకు చాలా ప్రయోజనకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆకుకూరలు: పాలకూర, పొన్నంటి కూర, తోటకూర, మెంతులు వంటి ఆకుకూరలలో లుటిన్ , జియాక్సంతిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ రెండు పోషకాలు కంటి రెటీనాలో ఉంటాయి . డిజిటల్ స్క్రీన్ల ద్వారా వెలువడే హానికరమైన నీలి కాంతి నుండి కంటిని రక్షిస్తాయి. ఆకు కూరలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటిశుక్లంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజన్ క్షీణత వంటి సమస్యలు తగ్గుతాయి. . ఇప్పుడు రెండు సంవత్సరాల పిల్లల నుంచి బెడ్ పై నుంచి లేవలేని వారు కూడా డిజిటల్ స్క్రీన్స్నే వాడుతున్నారు కదా..!
గుడ్లు : గుడ్లలో ఉండే ప్రోటీన్ లు ఎముకల పుష్టికే కాదు.. కళ్ళకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ఉండే పచ్చసొనలో లుటిన్, జియాక్సంతిన్ , జింక్ చాలా అధికంగా ఉంటాయి. జింక్ కళ్ళ రెటీనా ఆరోగ్యానికి ముఖ్యమైనది. కాలేయం నుండి రెటీనాకు విటమిన్ ఎ రవాణా చేయడంలో సహాయపడుతుంది. రాత్రి దృష్టిని మెరుగుపరిచేందుకు గుడ్డులో ఉండే ప్రోటీన్లు ఎంతో ఉపయోగకారిగా ఉంటాయి.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు : చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. సాల్మన్, ట్యూనా .. మాకేరెల్ వంటి కొవ్వు చేపలు ఎక్కువుగా ఉంటాయి. కొంతమంది చేపలు తినరు కనుక అలాంటి వారు వాల్‌నట్స్, చియా గింజలు. అవిసె గింజలను నానబెట్టి తినాలి. వీటిలో కూడా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి రెటీనా ఆరోగ్యానికి .. కళ్ళు పొడిబారడం తగ్గించడంలో చాలా సహాయపడతాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రెటీనాకు పనితీరు మెరుగుపడుతుంది.
సిట్రస్ పండ్లు : నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష, బొప్పాయి వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి కళ్ళలోని రక్త నాళాలు బలంగా ఉండేందుకు సహాయపడతాయి. బాదం .. వాల్‌నట్‌లు సీడ్స్ లో విటమిన్ E , ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రెండు పోషకాలు కళ్ళను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి .